హైదరాబాద్‌లో ఏటా పెరుగుతున్న హౌసింగ్ డిమాండ్‌ను తీర్చడానికి అందుకు అనుగుణంగా సరఫరా అంతరాన్ని తగ్గించాలని బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో ప్రస్తుతం దాదాపు 1.03 లక్షల యూనిట్లను నిర్మిస్తున్నట్లు తెలిసింది. వాటిలో 2021లో దాదాపు 18,510 యూనిట్లు పూర్తి కాగా, ఈ ఏడాది 16,480 యూనిట్లు పూర్తవనున్నాయి. అయితే 2024 వరకు మొత్తం పూర్తి అవుతాయని బిల్డర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే రెండు మూడేళ్లలో కొన్ని వేల ఇళ్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.