ఆతిథ్య సేవలందించే ఓయో(OYO) ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. కంపెనీలోని 600మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో మరో 250మందిని చేర్చుకోనున్నట్లు వెల్లడించింది. ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తూ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్‌ని కొనసాగించనున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో నియామకాలు చేపడితే తొలిగించిన వారికి ప్రాధాన్యమిస్తామని కంపెనీ సీఈవో రితేష్ అగర్వాల్ వెల్లడించారు.