హోటల్ రూమ్ బుకింగ్సులో ఓయో సరికొత్త రికార్డు సృష్టించింంది. డిసెంబరు 31న ఒక్కరోజే 4.5లక్షల బుకింగ్స్ వచ్చాయని ఓయో ప్రకటించింది. ఐదేళ్లలో ఇదే అత్యధికమని కంపెనీ సీఈవో రితేష్ అగర్వాల్ వెల్లడించారు. 2022లో అత్యంత రద్దీ రోజుగా డిసెంబరు 31ని ప్రకటించారు. ఈసారి అనూహ్యంగా గోవా కన్నా వారణాశి నుంచి ఎక్కువగా బుక్ అయ్యాయని రితేష్ వెల్లడించారు. ‘ఒక్కరోజే 450k బుకింగ్స్ వచ్చాయి. గతేడాది కంటే 35శాతం అధికం. ఒక్క రోజులో ఇన్ని బుకింగ్స్ రావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి’ అని రితేష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. మొత్తంగా 10 లక్షల మంది ఓయో యాప్, వెబ్సైట్ని డిసెంబరు 31న సందర్శించారు.