జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీని విమర్శిస్తూ మంత్రి రోజా ట్వీట్ చేశారు. “అప్పట్లో విశాఖలో జనసేన కార్యకర్తలు ఏపీ మంత్రుల మీద దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ను పరామర్శించాడు. గుంటూరు, కందుకూరు సభల్లో చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు. వీళ్ళ దృష్టిలో ప్రాణాల కంటే.. ప్యాకేజి నే గొప్పదా.!” అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.