INDని 5 వికెట్ల తేడాతో ఓడించిన PAK

© ANI Photo

2022 ఆసియా కప్‌లో రెండు ప్రత్యర్థి జట్ల మధ్య జరిగిన సూపర్ 4 గేమ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, ఆటకు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 60, కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ తలో 28 రన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇక 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ 71 పరుగులు చేయగా, మహ్మద్ నవాజ్ 42 రన్స్ చేసి విజృంభించి, ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెల్చుకున్నారు. భారత్ తరఫున బౌలర్లు భువనేశ్వర్, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.

Exit mobile version