భారత్‌తో పాక్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ విరాట్‌ని మెచ్చుకున్నాడు. అతడి కమ్‌బ్యాక్ గొప్పగా ఉందని బాబర్ అభిప్రాయపడ్డాడు. ‘తొలినాళ్లలో ఇబ్బంది పడ్డాడు. కానీ గొప్పగా పుంజుకున్నాడు. ఇలాంటి భారీ ఇన్నింగ్సులు ఆడటం మంచి విషయం. ఈ ఇన్నింగ్సులు ఆటగాడికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అంతేకాకుండా మానసికంగానూ ధృడంగా మారుస్తాయి’ అని బాబర్ హిందీలో చెప్పాడు. 53బంతుల్లో 82 పరుగులు చేసి కోహ్లీ భారత్‌కు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.