పొరుగుదేశం పాకిస్థాన్ లో ప్రభుత్వం మారబోతోందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి దింపే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వానికి చెందిన మిత్ర పక్షాలు సైతం ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా మారబోతున్నారట. ఇమ్రాన్ 100 శాతం ప్రమాదంలో ఉన్నారని ప్రభుత్వంలోని మిత్రపక్షం నేత పర్వేజ్ ఇలాహి కూడా ప్రకటిచండంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ఆ దేశ పార్లమెంట్ లో ఈ నెల చివర్లో ఓటింగ్ జరిగే అవకాశముంది. ప్రస్తుతం ఇమ్రాన్ కేవలం 7 సీట్ల మెజారిటీతో పాలన సాగిస్తున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గి పాక్ లో ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోతే.. అక్కడ ఖచ్చితంగా మళ్లీ సైనిక పాలన సాగే అవకాశం ఉందంటూ వాదనలు వస్తున్నాయి.