పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇటీవల యూట్యూబర్ తన్మయ్ భట్ నిర్వహించిన చిట్ చాట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లు.. లారా, షేన్ వార్న్, సెహ్వాగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ గురించి మాట్లాడుతూ ఏదో ఒకరోజు ఆయన చెంపపగలగొడతానని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని, ఆయన మంచి వ్యక్తి అని పేర్కొన్నాడు. అదేవిధంగా వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ లారా గురించి మాట్లాడుతూ ఓ సారి డ్రెస్సింగ్ వచ్చి బంతులతో చంపేస్తావా ఏంటని సరదాగా అడిగాడు అని చెప్పాడు. ఆ సరదా వీడియోను మీరూ చూసేయండి.