రష్యా చేస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్ దేశం అతలాకుతలమైపోతుంది. ఉక్రెయిన్ దేశంలో మన దేశం నుంచి వెళ్లిన విద్యార్థులే కాకుండా అనేక దేశాల నుంచి వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో డైరెక్టుగా విమానాలు ఉక్రెయిన్‌కు పోయి అక్కడ ఉన్న ఇండియన్ విద్యార్థులను తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఉక్రెయిన్ సరిహద్దుల వరకు ఇండియన్ జాతీయ జెండాలు చేతిలో పట్టుకుని రావాలని అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో తరలిస్తామని ఇండియన్ గవర్నమెంట్ తెలియజేసింది. ఆపరేషన్ గంగా అని ప్రత్యేక విమానాలను కూడా పంపించింది. ఇండియన్ స్టూడెంట్స్‌లాగే కొంత మంది పాకిస్తాన్, టర్కీ దేశానికి చెందిన విద్యార్థులు కూడా ఇండియన్ జాతీయ జెండాలను చేత బట్టుకుని ఉక్రెయిన్ బార్డర్ దాటుతున్నారు.