పాకిస్థాన్ నటి సజల్ అలీపై హనీట్రాప్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘హనీ ట్రాప్’ కోసం పాకిస్థాన్ వినియోగించిన వారిలో నటి సజల్ ఒకరని పాక్ మాజీ సైనికాధికారి యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే, ఈ వ్యాఖ్యలను నటి సజల్ ఖండించింది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమీ ఉండదని అభిప్రాయపడింది. ‘మనిషి వ్యక్తిత్వాన్ని చెరిపేయాలనుకోవడం మానవత్వానికే మచ్చుతునక. అది పాపం కూడా. మన దేశం మరీ ఇంత నీచానికి దిగజారిపోతుందని అనుకోలేదు’ అని సజల్ పేర్కొంది. 2017లో విడుదలైన ‘మామ్’ సినిమాలో శ్రీదేవి కుమార్తెగా సజల్ అలీ నటించింది.
-
Courtesy Instagram: sajalaly
-
Courtesy Instagram: sajalaly
-
Courtesy Twitter:SajalAli