పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం బిత్తిరి సత్తితో చేసిన ఇంటర్య్వూ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ ఇంటర్య్వూలో ఈ మూవీ డైరెక్టర్ మారుతి, హీరో గోపిచంద్, హీరోయిన్ రాశీ ఖన్నా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సత్తి తనదైన శైలిలో ప్రశ్నలు వేసి వారిని నవ్వుల్లో ముంచెత్తాడు. అసలు లాయర్ అయిన తర్వాత హీరో ఎందుకు ఫైట్ చేస్తాడని, హీరోయిన్ క్యారెక్టర్ సహా పలు క్వాచ్ఛన్స్ అడిగాడు. మరోవైపు హీరో ప్రభాస్ తో గోపిచంద్ ఫ్రెండ్ షిప్ ఎలా ఉందని అడిగాడు. దర్శకుడు మారుతి గురించి సత్తి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంకా ఏమన్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోపై ఓసారి లుక్కేయండి మరి.