గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్గా మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. జూలై 1న విడుదల కానున్న ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈనెల 12వ తేదీన హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఫుల్ ఫన్‌గా ఎంటర్టైన్మెంట్ సాగుతున్న ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాను GA2 పిక్చర్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు.