పానీపూరి అంటే మనోళ్లు లొట్టలేసుకుని తింటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడి తేనె ఈ చిరు తిండిని నేపాల్ రాజధాని ఖాట్మండులో బ్యాన్ చేశారు. ఈ పూరి తయారీ ఉపయోగించే నీటిలో కలరా వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియాను గుర్తించడంతో ఆ దేశ ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో లలిత్ పూర్ మెట్రోపాలిటిన్ సిటీలో కలరా వ్యాప్తి పెరుగుతుండడంతో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది అక్కడి ప్రభుత్వం.