పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను పంకజ్ ఖండించాడు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు. అయితే ఈ రూమర్లు నిజం కావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నాడు త్రిపాఠి. కాగా అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పంకజ్.. తెలుగులో మంచు విష్ణు ‘దూసుకెళ్తా’ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.