తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం బీజేపీలో చేరబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవం కారణంగా ప్రధాని మోది చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం వర్గం ప్రధాని మోడీ, అమిత్ షా హోర్టింగులను ఏర్పాటుచేసింది. దీంతో పన్నీర్ సెల్వం కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకేలో అధికార పోరు నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి పళవిస్వామి, పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ తీర్మానాన్ని ఖండించిన పన్నీర్ సెల్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు.