భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్వదేశంలో అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు దూరం కానున్నాడు. పంత్ పూర్తిగా కోలుకునేందుకు దాదాపు 9 నెలలు పట్టొచ్చని ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రి వైద్యులు బీసీసీఐకి తెలిపారు. పంత్ కాలు, మోకాలుకు రెండు సర్జరీలు చేయాలని వెల్లడించారు. ఈ రెండు శస్త్రచికిత్సలు లండన్‌లో చేయాలని వారు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పంత్ ప్రయాణం చేసే స్థితిలో లేడు కాబట్టి.. పూర్తిగా కోలుకున్నాకే లండన్ తరలించాలని బీసీసీఐ భావిస్తోంది.