మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 15 వ సీజన్ ప్రారంభం కాబోతోంది. అన్ని జట్లూ కొత్త ఆటగాళ్ళతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గత నెలలో జరిగిన మెగా వేలం తర్వాత తమ జట్టులో చేరిన కొత్త ప్లేయర్ల గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం, మేము నెట్స్ లో కొత్త ఆటగాళ్లకు ఏమి అవసరమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. మ్యాచ్ల సమయంలో ఆటగాళ్ల పాత్ర గురించి వారితో మాట్లాడినట్లు తెలిపాడు. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ గురించి మాట్లాడుతూ ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని, అతనిని కలిసినప్పుడల్లా, ఓ కుటుంబ సభ్యుడిని కలిసినట్లు అనిపిస్తుందని పేర్కొన్నాడు.