ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ అంత సులువేమీ కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండా ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించడం కేసీఆర్కు ఒక సవాలుగా మారనుందని అంటున్నారు. పోలవరం ఎత్తు పెంపు వివాదం, నదీ జలాల పంపకం, విభజన హామీలు ఇంకా నెరవేరకపోవడమే ఇందుకు కారణం. ఏపీ రాజకీయ నేతలు కూడా ఇదే అంశాల్ని లేవనెత్తుతున్నారు. దీనికి మరి కేసీఆర్ ఏ విధంగా సమాధానం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల తోట చంద్రశేఖర్, రావుల కిశోర్, పార్థసారథి పార్టీలో చేరినప్పుడు కేసీఆర్ ఈ సమస్యలను ప్రస్తావించకపోవడం గమనార్హం.