తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. విజయ్ దేవరకొండ, శాలినీ పాండేల కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే, తొలుత హీరోయిన్ పాత్ర కోసం శాలినీని అనుకోలేదట. నటి పార్వతి నాయర్‌ను ప్రీతి క్యారెక్టర్ కోసం చిత్రబృందం సంప్రదించిందట. కానీ, ఇందులో లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో పార్వతి రిజెక్ట్ చేసిందట. సినిమా విడుదల తర్వాత చాలా బాధపడినట్లు ఇటీవల పార్వతి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అదృష్టం తలుపుతడితే.. సద్వినియోగం చేసుకోలేక పోయానని విచారం వ్యక్తం చేసింది. కాగా, ఉత్తమ విలన్ సినిమాలో కమల్ సరసన పార్వతి నటించింది.