ముంబై బౌలర్లకు కాలరాత్రిని మిగిల్చిన కమిన్స్

© IPL Photos - IPLT20.com

ప్యాట్ కమిన్స్.. ఈ పేరును ముంబై ఇండియన్స్ బౌలర్లు అంత ఈజీగా మర్చిపోలేరేమో. అంతలా ముంబై ఇండియన్స్ బౌలర్ల భరతం పట్టాడు కమిన్స్. కేకేఆర్ గెలుపుకు 162 పరుగులు కావాలి. కానీ 101 పరుగుల వద్దే అరవీర భయంకర రస్సెల్ (11) వెనుదిరిగాడు. ఇక క్రీజులో హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉన్న వెంకటేశ్ అయ్యర్ (50*) మాత్రమే ఉన్నాడు. కానీ ఏడో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన కమిన్స్ (56*) ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. ముంబై తరఫున ఏ బౌలర్ వేసినా కానీ వదిలిపెట్టలేదు. సామ్స్ వేసిన ఓవర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ తరుణంలోనే 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా కేకేఆర్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

Exit mobile version