బాలివుడ్లో కొంతకాలంగా సరైన బ్లాక్బ్లస్టర్లు లేవు. అగ్ర సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. కరోనా తర్వాత థియేటర్ల యజమానులకు కోలుకునే పరిస్థితే రాలేదు. అయితే చాలా కాలం తర్వాత ‘పఠాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలివుడ్ బాద్షా, కింగ్ షారుఖ్ ఖాన్ ఆ థియేటర్లు మళ్లీ తెరుచుకునేలా చేశాడు. వివిధ ప్రాంతాల్లో మూతపడిన 25 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ‘పఠాన్’ సినిమాతో తిరిగి తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. “ చిన్నప్పుడు అన్ని సినిమాలు సింగిల్ స్కీన్లలోనే చూశాం. ఆ మజాయే వేరు. కొత్తగా తెరుచుకున్న వీరందరి థియేటర్లకు నా సినిమా ఉపయోగపడాలని ప్రార్థిస్తున్నా” అంటూ షారుఖ్ ట్వీట్ చేశాడు.