బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ అని పలువురు చెబుతున్నారు. సెన్సార్ స్క్రీనింగ్‌లో సినిమా చూసిన కొందరు సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు. అదిరిపోయే ట్విస్ట్‌లు, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని రివ్యూ ఇస్తున్నారు. ఇప్పటికే సినిమా బుకింగ్స్ కూడా చాలా పాజిటివ్‌గా కనిపిస్తున్న వేళ… ఈ పాజిటివ్ రివ్యూలు సినిమాగా బూస్ట్ ఇస్తున్నారు. మరోవైపు బాయ్‌కాట్ పఠాన్ ప్రచారం కూడా గట్టిగానే నడుస్తోంది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా… బ్లాక్‌బస్టర్ అవుతుందో..బాయ్‌కాట్ అవుతుందో వేచి చూడాలి మరి!