షారుఖ్ ఖాన్ హీరోగా నాలుగేళ్ల తర్వాత వచ్చిన సినిమా ‘పఠాన్’. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తొలిరోజు కాసులవర్షం కురిపించింది. బుధవారం విడుదలైన పఠాన్… ఇండియాలో రూ.50 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ లెక్కన చూస్తే ఈ వీకెంట్ కల్లా సినిమా సులభంగా రూ.150 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమాకు రూ.400 కోట్ల నెట్ మార్క్ ఈజీగా క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు.