బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పడుకొనే హీరోయిన్గా నటించిన ‘పఠాన్’ మూవీ నేడు విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో దేశవ్యాప్తంగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. కాగా ‘పఠాన్’ మూవీ రిలీజ్‌కు ముందే లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ రూ.కోట్లలో నష్టపోయినట్లు సమాచారం. తమిళ్ రాకర్స్, ఫిల్మిజిల్లా, పాగల్ వరల్డ్, వేగ మూవీస్ వంటి పలు వెబ్సైట్లలో ఈ మూవీ దర్శనమిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. HD ప్రింట్‌తో ఈ మూవీ ఆన్లైన్లో దర్శనవివ్వడంతో మేకర్స్ చర్యలు తీసుకుంటున్నారు.