షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన పఠాన్ చిత్రంపై వివాదం కొనసాగుతోంది. ఈ చిత్రంలో పాటపై నటుడు ముఖేష్ కన్నా మరోసారి స్పందించారు. “ బేషరమ్ రంగ్లోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని సీబీఎఫ్సీ సూచించినట్లు విన్నాను. సెన్సార్ బోర్డు లిరిక్స్ మార్చాలని చెబితే సరిపోదు. అభ్యంతరకర సన్నివేశాలను మార్పించాలి. బాయ్‌కాట్‌కు నేను మద్దతిస్తున్నా. అలా చేస్తేనే ఏ నిర్మాత భవిష్యత్‌లో ఇలా చేసేందుకు ముందుకు రాడు ” అన్నారు.