ఎట్టకేలకు ‘యశోద’ సినిమాపై ముదిరిన వివాదం ముగిసింది. సినిమాలో ఈవా ఆసుపత్రి పేరు వాడటంపై యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసి.. కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో యశోద ఓటీటీ విడుదలపై కోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ క్రమంలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చొరవ తీసుకుని ఆస్పత్రి యాజమాన్యాన్ని కలిశారు. సినిమాలో ఈవా పేరును కనిపించకుండా చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం కేసును విత్ డ్రా చేసుకుంది. దీంతో యశోద ఓటీటీ విడుదలకు మార్గం సుగమం అయినట్లే.