విజయవాడ-దువ్వాడ ట్రాక్ ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో సికింద్రాబాద్-విజయవాడ-దువ్వాడ మధ్య 130 కి.మీ వేగంతో రైళ్లు దూసుకెళ్లనున్నాయి. ముఖ్యంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణానికి మార్గం సుగమం అయింది. విజయవాడ నుంచి 7.50కు బయల్దేరిన ట్రైన్ దువ్వాడకు 11.50కు చేరుకుంది. 4 గంటల్లోనే 330 కి.మీ ప్రయాణించింది. ఇదివరకటితో పొల్చితే గంటన్నర సమయం ఆదా అవుతుంది. గౌతమి, గోదావరి, కోణార్క్, ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్లు 130 కి.మీ వేగంతో పరుగులు తీయనున్నాయి.