హీరో సత్యదేవ్ చేసిన ‘గాడ్సే’ చిత్రం.. పవన్ కళ్యాణ్ లేదా ఎన్టీఆర్ చేసి ఉంటే చరిత్ర సృష్టించేదని అయ్యేదని నిర్మాత సి.కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఓటీటీలో చూసినంతగా.. ఆ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు ఆదరించలేదని చెప్పారు. కథను మోయగలిగే హీరో ఉండాలని ముందే సూచించినట్లు ఆయన తెలిపారు. ‘బాగా చదివించిన పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే వేదన పడే తల్లిదండ్రులకు ఇది రీచ్ అవుతుందని తీశాం. కానీ, అలా కుదరలేదు. నటుడు సత్యదేవ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా దీన్ని తెరకెక్కించాం’ అని కళ్యాణ్ చెప్పారు.