జనసేన బస్సు యాత్ర కోసం తీర్చిదిద్దిన ‘వారాహి’ ప్రచార రథానికి అద్దిన రంగుపై పవన్ కల్యాణ్ స్పందించారు. బుల్లెట్ బండికీ, కారుకూ ఉండని రూల్స్.. తనొక్కడికే ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. వారాహికి నిషేధిత రంగు వేశారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ‘అసూయతో వైకాపా నేతల ఎముకలు రోజురోజుకు కుళ్లిపోతున్నాయి. కారు నుంచి కట్ డ్రాయర్ కంపెనీల దాకా అన్నీ రాష్ట్రం విడిచి వెళ్తున్నాయి. టికెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు వంటి చిల్లర పనులు మానుకొని అభివృద్ధిపై వైకాపా దృష్టి సారించాలి’ అని పవన్ కళ్యాణ్ సూచించారు.