పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై చిరంజీవి మరోసారి పెదవి విప్పారు. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానంలో ఉంటాడని మెగాస్టార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రాజకీయాలు అన్నాక అవసరం ఉన్నా, లేకపోయినా మాటలు అనాలి. మాటలు పడాలి. పవన్ చేస్తున్నదీ అదే. తను రాజకీయాలకు తగిన వాడు. ఏదో ఒక రోజు ప్రజల ఆశీస్సులతో ఉన్నత స్థానంలో నిలుస్తాడు’ అని చిరంజీవి చెప్పారు. ఎర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ రాజకీయాలకు తగిన వాడు: చిరు

Courtesy Twitter: janasenaparty