పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా నుంచి ఓ లుక్ లీక్ అయింది. పవన్ కళ్యాణ్ పక్కన తేజ్ అమాయకంగా నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళంలో విడుదలైన ‘వినోదయ సీతమ్’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతుంది. మాతృక డైరెక్టర్ సముద్రఖని దీనినీ తెరకెక్కిస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు రూ.45కోట్లు పారితోషికం తీసుకోవడం విశేషం. 22 రోజుల పాటు పవర్ స్టార్ షూటింగులో పాల్గొననున్నాడు. ఇందులో దేవుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.