నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన మూవీ అంటే సుందరానికి. ఈ కామిక్ మూవీ రేపు విడుదల కానుంది. ఈ రోజు అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఇక ఈ మూవీకి ఎక్కడ లేని బజ్ వచ్చింది. కానీ పవన్ ఏం మాట్లాడుతాడా? అని మూవీ టీంకు భయం పట్టుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ వేడుకలో ఏమైనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా? అనే టెన్షన్ పట్టుకుందట. మరి పవర్‌స్టార్ ఏం మాట్లాడతాడోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.