మ‌హేశ్‌బాబుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హార్ట్‌ఫుల్ బ‌ర్త్‌డే విషెస్‌

© File Photo

నేడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న‌క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. మ‌హేశ్ త‌న న‌ట‌న‌తో న‌వ‌త‌రం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. ఎంద‌రో చిన్నారుల‌కు గుండె ఆప‌రేష‌న్లు చేయించ‌డం వంటి సేవా కార్య‌క్ర‌మాలు అభినంద‌నీయం. కృష్ణ గారి న‌ట వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ తండ్రి బాట‌లోనే ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు అండ‌గా నిలుస్తున్నాడు. అర్జున్ సినిమా స‌మ‌యంలో పైర‌సీపై ఆయ‌న గ‌ళం విప్పిన‌ప్పుడు నేనే మ‌ద్ద‌తుగా నిలిచాను. జ‌ల్సా సినిమాకు అడ‌గ్గానే వాయిస్ ఓవ‌ర్ అందించారు. హీరోగా మ‌హేశ్‌ ప్రేక్ష‌కుల మెప్పు, పుర‌స్కారాలు పొదుతూ మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని కోరుకుంటున్నాన‌ని ప‌వ‌న్‌ వ‌రుస ట్వీట్లు చేశాడు.

Exit mobile version