పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం గురించి కుటుంబ కథా చిత్రాల దర్శకుడు దశరథ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పవర్ స్టార్, హరీశ్ కాంబోలో తెరి రీమేక్ చేస్తున్నారని.. దానికి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. “ తెరి సినిమా స్ట్రక్చర్‌ను తీసుకొని చాలా మార్పులు చేశాం. అది పవన్ అభిమానులకు కచ్చితంగా నచ్చేలా హరీశ్ డిజైన్ చేశారు. సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది “ అన్నారు. ప్రస్తుతం హరీశ్ పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీస్తున్నారు. ఇది తెరి రీమేక్ అని తెలుస్తోంది.