పవన్ కళ్యాణ్ ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదాయ’ సీతం సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇదే సినిమాను తెలుగులో పవన్‌కళ్యాణ్ హీరోగా తీయబోతున్నాడు. ఈ కథలో ఒక వ్యక్తి తన ఇష్టానుసారమే అన్ని జరగాలనుకుంటాడు. కానీ అనుకోకుండా మరణిస్తాడు. అతడిని తీసుకెళ్లేందకు వచ్చిన దేవదూతను బ్రతిమిలాడి వెనక్కి వెళ్లి తన తప్పులు సరిదిద్దుకుంటానని చెప్తాడు. ఇది ఒక ఫాంటసీ కామెడీ డ్రామా. ఈ కథ పవన్‌కు నచ్చడంతో రీమేక్‌కు ఓకే చెప్పాడు. ఈ సినిమాలో పవన్‌తో పాటు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు.