పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. దేవుడు తెలివి తేటలు ఇచ్చాడని.. వాటిని సరిగ్గా వాడాలని జనసేన అధినేతకు కేఏ పాల్ సూచించారు. లోకేష్‌ను కాదని సీఎం పదవిని పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. తనకు ఓట్లు వేయలేదంటూ ప్రజలను పవన్ కళ్యాణ్ నిందించడం సరికాదన్నారు. ‘ఓట్ల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చెబుతావా. సీఎం పదవి కోసం పొత్తు పెట్టుకుంటావా? రేపు ఎవరైనా కేంద్ర మంత్రి పదవి, ఎంపీ సీటు ఇస్తానంటే వారితో కలిసిపోతావా. కొంచెమైనా బుర్ర ఉండాలి’ అంటూ పవన్ కళ్యాణ్‌ని కేఏ పాల్ విమర్శించారు.