TS: హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో హకీంపేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఓ లారీ రిపేర్ కావడంతో హకీంపేట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. బస్సు యాత్ర కోసం సిద్ధం చేసిన ‘వారాహి’ వాహనానికి పూజ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టు వెళ్తున్న సంగతి తెలిసిందే. పూజ అనంతరం జనసేనాని కార్యకర్తలతో కలిసి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.