జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తిరుపతిలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో పాటు, 2009లో అక్కడి నుంచే చిరంజీవి పోటీ చేసి గెలవడంతో, పవన్ కళ్యాణ్‌ను కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని జనసేన నేతలు సూచిస్తున్నారట. దీంతో పాటు జనసేన నేత కిరణ్ రాయల్.. పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని సోషల్ మీడియాలో చెప్పడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.