వైఎస్ఆర్సీపీ(యువజన శ్రామిక రైతు కాంగ్రెస్) అని పేరు పెట్టుకున్నప్పటికీ అందులో ఒకరికి కూడా న్యాయం చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు లేవు, కార్మికులకు పని లేదు, రైతులకు కనీస మద్దతు ధర లేదు అని ప్రభుత్వంపై మండిపడ్డాడు. ఎవరికీ అర్థం కాకుండా మాట్లాడటంలో మంత్రి బొత్స మాస్టర్స్ చదివాడని వ్యంగ్యాస్తాల్రు సంధించాడు. బహుశా అదే అతడి హ్యూహం కావొచ్చునని అన్నాడు. ఇక బైబిల్లో చెప్పినట్లుగా రాజకీయ నేతలు పరిమితిలో బతకడం నేర్చుకోవాలి.. అది కచ్చితంగా మీ విలువని పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.