పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబుపై ఆర్జీవీ మరోసారి స్పందించారు. “సోదరుడు కాబట్టి చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు నాగబాబు ముఖ్యమై ఉండొచ్చు గానీ నాకు కాదు. నేను జనసేన, పవన్ మీద వ్యాఖ్యలు కేవలం అభిమానిగా చేశాను. నాగబాబు లాంటి వారిని సలహాదారుగా పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో జనమే చెబుతారు” అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.