పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తతం రాజకీయాల మీద దృష్టి సారించాడు. వరుసగా సినిమాలు కమిట్ అయినప్పటికీ క్రిష్ హరిహర వీరమల్లులో మాత్రమే నటిస్తున్నాడు. అయితే తాజాగా ప్రొడ్యూసర్లకు పవన్ డెడ్‌లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. దసరా వరకు షూటింగ్‌లలో పాల్గొంటానని, తర్వాత రాజకీయాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘వినోదయ సిత్తం’ రీమేక్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే పవన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’, సురేందర్ రెడ్డి సినిమాలు ప్రశ్నార్థకంగా మారాయి.