ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను తిట్టేందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో సభ పెడుతున్నారని బందరు ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ‘‘సీఎం జగన్‌ను, కాపు నాయకులను దూషించేందుకే పవన్ సభ పెడుతున్నారు. మచిలీపట్నంలో జరగబోయేది ఇదే. ఆవిర్భావ సభ కాదు.. అస్మదీయ దూషణ సభ. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడమే పవన్ లక్ష్యం. పవన్ ఎప్పటికీ మారడు.’’ అంటూ పేర్ని నాని విరుచుకుపడ్డారు.