వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో ఏది జరిగిన నాదే తప్పంటూ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ తప్పుడు హామీలు ఇచ్చి సానూభూతితో ఓట్లు వేయించుకున్నారన్నారు. వివేకానందను హత్య చేసి గుండెపోటు అంటూ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలు తెలియజేసి అధికారంలోకి వస్తామని ఆయన పేర్కొన్నారు.