పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో తన జాగ్వార్ కారుతో డీసీపీ బెనిటా మేరీ జాకర్ ను ఢీకొట్టారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేయగా.. వెంటనే బెయిలుపై విడుదలయ్యారు. కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిషేధం విధించిన నేపథ్యంలో ఈ కేసు బయటికి రావడం ఆసక్తి రేపుతోంది.