ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ ఆర్ఆర్ఆర్ అభిమానులకు శుభవార్త చెప్పింది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఒక రూపాయికే సినిమా టికెట్ ను అందించనుంది. ఈ ఆఫర్ ను క్లెయిమ్ చేసుకోవడానికి వినియోగదారులు ఏదైనా మొబైల్ నెంబర్ కి రూ.1 పంపిస్తే రూ.150 వ్యాల్యూ చేసే వోచర్ ను పొందుతారు. తర్వాత మీరు పంపిన రూ.1ని కూడా రీఫండ్ చేయనున్నట్లు పేటీఎమ్ తెలిపింది. తద్వారా ఫ్రీగా RRR మూవీ టికెట్ ను పొందవచ్చన్నమాట. అయితే, మార్చి 24 వరకే ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది.