పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ జట్టు 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ విధించిన 210 పరుగుల టార్గెట్ ను చేధించలేక ఆర్సీబీ బ్యాటర్లు చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేశారు. పంజాబ్ బౌలర్లలో రబడ 3, రిషిధావన్, రాహుల్ చహర్ చెరి 2, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో మ్యాక్సీ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో పాయింట్ల పట్టిక మరింత క్లిష్టమయింది.