పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్‌కు పాక్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీసులు పంపింది. జట్టు ప్రతిష్ఠను దెబ్బతీసేలా మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు బోర్డు ఈ చర్య తీసుకుంది. వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత, అలాగే ఫైన్‌లో ఇంగ్లండ్‌తో ఓటమి తర్వాత పాక్‌పై అనేక మంది మాజీలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అందులో అక్మల్ ఒకరు. పాక్ క్రికెట్ ప్రతిష్ట దిగజార్చేలా, జట్టు పరువు తీసేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించబోమని బోర్డు స్పష్టం చేసింది.
కమ్రాన్ అక్మల్‌కు PCB లీగల్ నోటీసులు

Courtesy Twitter:@KamiAkmal23