స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ చాంపియన్‌గా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ మ్యాచ్‌లో థాయిలాండ్ షట్లర్ బుసానన్‌పై సింధు ఘన విజయం సాధించింది. వరుస సెట్లలో 21-16, 21-8 తేడాతో విజయం సాధించి టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది.