అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్‌లో పర్యటించారు. ఈ పర్యటనను తాము తీవ్రంగా పరిగణిస్తామని చైనా హెచ్చరించినప్పటికీ పెలోసీ పర్యటనను కొనసాగించారు. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. అమెరికాను ఆపడం చైనా తరం కాదని స్పష్టం చేశారు. తైవాన్‌ను ఒంటరి చేయాలని డ్రాగన్ దేశం భావిస్తోందని, ఆ దేశాన్ని ఒంటరి చేయాలని చూస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అటు తైవాన్, చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. సరిహద్దులో ఇరు దేశాలు ఆయుధాలను మోహరిస్తోంది.