మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట నుంచి పెన్నీ ఫుల్ సాంగ్ విడుదలయింది. ఈ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ పాటలో మహేశ్ తనయ సితార స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. నకాష్ అజీజ్ ఈ పాటను పాడగా.. అనంత శ్రీరామ్ రచించాడు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.